Praja Kshetram
తెలంగాణ

ఉధృతంగా హిమాయత్ సాగర్.. నీట మునిగిన పంట పొలాలు.

ఉధృతంగా హిమాయత్ సాగర్.. నీట మునిగిన పంట పొలాలు.

హైదరాబాద్ సెప్టెంబర్ 01 (ప్రజాక్షేత్రం): తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చే ఈసీ కాలువ పొంగిపొర్లుతోంది. రంగారెడ్డి జిల్లా. మొయినాబాద్ మండలం అండాపూర్ గ్రామం వద్ద ఈసీ కాలువ రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురవడంతో వికారాబాద్ మీదుగా మన్నెగూడ, షాబాద్ అండాపూర్ గ్రామాల మీదుగా హిమాయత్ సాగర్ జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ వరద ప్రవాహం వల్ల ఈసీ చుట్టుపక్కల ఉన్న పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి భారీగా పంట నష్టం జరిగింది, చెరువుల పరిరక్షణకి హైడ్రా చేపడుతున్న చర్యల నేపథ్యంలో హిమాయత్ సాగర్‎కి ఈ వరదలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది, హిమాయత్ సాగర్ ఆక్రమణల వల్లే బ్యాక్ వాటర్ నిలిచి ఇక్కడ పంట పొలాలు నీట మునిగాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

Related posts