Praja Kshetram
తెలంగాణ

రోడ్డు కిందికి దూసుకెళ్లిన స్కూల్‌ బస్‌.

రోడ్డు కిందికి దూసుకెళ్లిన స్కూల్‌ బస్‌.

 

-40 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ముప్పు

 

చేవెళ్ల, సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం): స్కూల్‌ బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల సిల్వర్‌ డెయిల్‌ స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులకు త్రుటిలో ముప్పు తప్పింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చేవెళ్లలోని సిల్వర్‌ డెయిల్‌ స్కూల్‌ బస్‌ మంగళవారం ఉదయం చన్వెల్లి, ఇక్కరెడ్డిగూడ గ్రామాల విద్యార్థులు 40 మందిని ఎక్కించుకొని స్కూలుకు వెళ్తోంది. డ్రైవర్‌ బస్సును స్పీడ్‌గా నడిపాడు. కుక్క అడ్డురాగా సడెన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు అ దుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకపోయింది. విద్యార్థుల తల్లిదండ్రుల చేరుకొని పిల్లలను కిందికి దించారు. డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌ వల్లే ప్రమాదం జరిగిం దన్నారు. బస్సులో పరిమితికి మించి పిల్లులున్నారని మరికొందరు మండిప డ్డారు. కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి బ్రేక్‌ వేయడం వల్లే బస్సు ఒక సైడ్‌కు లాగిందని డ్రైవర్‌ చెప్పాడు. సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్‌ మోహనచారి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిం చారు. విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related posts