Praja Kshetram
తెలంగాణ

సీఎం సహాయనిధికి టెన్త్ క్లాస్ విద్యార్థి విరాళం..

సీఎం సహాయనిధికి టెన్త్ క్లాస్ విద్యార్థి విరాళం..

 

 

హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజాక్షేత్రం): తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వరద బాధితులకు అండగా పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు తన వంతు సహాయం చేసింది. ‘సీఎం అంకుల్ నమస్తే, సీఎం సహాయనిధికి నా వంతు సహాయం రూ. 3 వేలు ఇస్తున్నాను.’ అంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల సమక్షంలో నగదు కవర్ అందజేసింది. అయితే, మహబూబాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు తన కిడ్డీ బ్యాంకులో జమ చేసిన డబ్బులు వరద బాధితులకు తన వంతు సాయంగా సీఎంకు అందజేసి గొప్పమనసు చాటుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని సాయి సింధును పలువురు అభినందిస్తున్నారు.

Related posts