రేవంత్‌కు చెక్కు అందజేసిన చిరంజీవి.
హైదరాబాద్ సెప్టెంబర్ 16(ప్రజాక్షేత్రం): ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలుస్తున్నారు. తనవంతుగా హీరో చిరంజీవి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల సిఎంల సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున రూ.కోటి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తెలంగాణా సిఎం రేవంత్‌రెడ్డిని చిరంజీవి కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తన కుమారుడు రామ్‌చరణ్ తరపున మరో రూ.50 లక్షలు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హారోయిన్‌గా నటిస్తున్నారు.