పేదల ఆకలి తీర్చడంలో వెలకట్టలేని ఆనందం
– జై హనుమాన్ బాయ్స్ కమిటీని అభినందించిన “వాసుపల్లి”
విశాఖపట్నం దక్షిణం సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):పేదల ఆకలి తీర్చడంలో వెలకట్టలేని ఆనందం ఉందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 38వ వార్డులో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జై హనుమాన్ బాయ్స్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ హాజరై స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు తరచూ నిర్వహించే కమిటీకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జై హనుమాన్ కమిటీ చైర్మన్ ఎల్లారాజు, దక్షిణ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, పోలరాజు, బుజ్జి, రామరాజు, సుధా రాజు, ఆకుల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.