Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

 

-స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు

అనకాపల్లి సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఉదయం నర్సీపట్నం మునిసిపాలిటీలో ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తో కలిపి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రతి పేదవాడికి ఉదయం టిఫిన్, మధ్యానం భోజనం, రాత్రికి డిన్నర్ 5 రూపాయలకే ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ అన్న క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటిన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ తో కలిసి అన్నా క్యాంటీన్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో జయరామ్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, చింతకాయల పద్మవతి, జడ్పిటిసి రమణమ్మ, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts