ఘనంగా వినాయక నిమజ్జనం.
శంకర్ పల్లి సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో పోచమ్మ ఆలయ గణేష్ విగ్రహ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుడి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. 15 రోజులు ప్రత్యేకమైన పూజలు అందుకున్న గణనాథుడి వేడుకలలో మాజీ ఎంపీటీసీ భవాని యాదగిరి ప్రత్యేక పూజలు చేసి గణనాథుడికి తీర్థప్రసాదాలను సమర్పించారు. గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, గణనాథుడిని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం అన్న ప్రసాదాలను పంచిపెట్టారు. అనంతరం యూత్ సభ్యులు,గ్రామ పెద్దలు, మహిళల సమక్షంలో భారీ డీజే, బ్యాండ్ చప్పుల మధ్య ఆ గణనాథుడి శోభయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ ఆలయ గణేష్ విగ్రహ కమిటీ, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.