మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా రూ.500/- లకు గ్యాస్ సిలిండర్ పొందుతున్న అర్హులు అయిన మహిళలందరికీ గుర్తింపు పత్రాలను అందజేశారు..ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
-ఇంకా మిగిలిన వారు సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలి.
-గత ప్రభుత్వం మహిళలను, దళితులను మోసం చేసింది. ఎమ్మెల్యే.
-బీద, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ 6 గ్యారంటీలు అందించే బాధ్యత నాది.
-ఇచ్చిన మాట ప్రకారం 31వేల కోట్లు వెచ్చించి రూ.2 లక్షలు రుణమాఫీ చేశాము.. ఆయా కారణాలతో మాపీ కాని వారికి త్వరలోనే మాపీ చేస్తాం.
-ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిధి.
-పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
-కోట్ పల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద 11,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
-ప్రాజెక్టు పుననిర్మాణం కోసం110కోట్ల నిధులు తెచ్చే బాధ్యత నాది ఎమ్మెల్యే.
-గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టింది.
పెద్దేముల్ సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రజా పాలనలో బాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500/- లకే సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు గుర్తింపు పత్రాలను ఆయన చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఎన్నికల్లో సమయంలొ సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని భరోసా కల్పించారు. మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచాను.. ప్రతిక్షణం మీ కోసమే పని చేస్తా అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించడంతో పాటు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మహిళలకు చేయుత అందించాలనే లక్ష్యంతో పావలా వడ్డీ రుణాలు పునః ప్రారంభం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని అభివర్ణించారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం గ్యాస్ కలెక్షన్స్ లలో సుమారు 70-80% కలెక్షన్స్ లకు సబ్సిడీ అందింది. రాని వారు కూడా సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వంలో అర్హులైన వారికి కాదని సొంత పార్టీ వారికే సంక్షేమ పథకాలు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం అని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న, ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిధి అని అన్నారు. త్వరలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు,సంక్షేమంతో పాటు మండల అభివృద్ధికి పూర్తి సహాకారం ఉంటుందని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ, డ్వాక్రా భవనలు పూర్తి చేస్తాం.కోట్ పల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పునః ప్రారంభం చేసి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తాం అని ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి..మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి ధార సింగ్, టిపిసిసి రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్, కోట్ పల్లి మార్కేట్ కమిటీ చైర్మన్ అంజయ్య, మహిళ అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా ఉపాధ్యక్షులు.. న్యాయవాది ఎల్లారెడ్డి, పార్టీ అధ్యక్షుడు కొండాపురం గోపాల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, ఏ-బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సింహులు, పార్టి నాయకులు నారాయణ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై నరసింహులు, ఉప్పరి మల్లేష్, మాజీ మండల్ ప్రెసిడెంట్ చిన్న నర్సింహులు, ఆనంద చారి, మాజీ ఎంపిటిసి విద్యాసాగర్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు.. అనిల్, మహేష్, పార్టి కార్యకర్తలు… కోళ్ల పెంటప్ప,ఎర్ర బాలప్ప, ఫయాజ్, సాయిలు, గోపాలకృష్ణ, అధికారులు.. బి. సత్యనారాయణ, తహసిల్దార్ కిషన్ నాయక్, ఎంపీడీవో జర్నప్ప, మహిళా లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.