తొండుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలి.
-మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమర్రి నర్సింహులు.
రాజేంద్ర నగర్ సెప్టెంబర్ 22 (ప్రజాక్షేత్రం):తొండుపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేసి బ్రిడ్జ్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలి చిలకమర్రి నరసింహ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు మాజీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయే మార్గమధ్యంలో అంటే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సంవత్సరాలు గడుపుతున్నప్పటికీ నత్తనడకగా సాగుతున్నాయి దానితో వందలాది వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా తుండుపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.