Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ ఉద్యమ కళాకారులను ఆదుకొని వారికి ఉద్యోగాలు కల్పించాలి.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ ఉద్యమ కళాకారులను ఆదుకొని వారికి ఉద్యోగాలు కల్పించాలి.

-తెలంగాణ రాష్ట్ర కళాకారుల నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు‌

-మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ.

వికారాబాద్ సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలైనా నిజమైన ఉద్యమ కళాకారులను గుర్తించకుండా వారికి తీరని అన్యాయం జరిగిందని ఆదివారం జానపద కళాకారుల వికారాబాద్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో కళాకారుల నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు మరియు ఆత్మీయ అతిథులుగా పి ఆనంద్ మాదిగ, రాష్ట్ర నాయకులు అనువాజ్ వెంకటేశం ,హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది‌. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మా వంతు ఖమ్మంలో జరిగిన వరద బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకొని మా వంతుగా కొంత వరద బాధితులకు నిధులు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారులు మమత అంజిలప్ప కృష్ణ శ్రీనివాస్ పెంటప్ప విజయ్ రాజశేఖర్ అనిత రేణుక నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Related posts