Praja Kshetram
తెలంగాణ

గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడ గ్రామాలలో బిజెపి సభ్యత్వం.

గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడ గ్రామాలలో బిజెపి సభ్యత్వం.

-రాబోయే ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

-బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ల రాములు గౌడ్.

శంకర్‌ పల్లి సెప్టెంబర్ 24(ప్రజాక్షేత్రం):రాబోయే ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శంకర్‌ పల్లి మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ల రాములు గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడ గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బిజెపి సభ్యత్వం కార్యక్రమాన్ని రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు గౌడ్ మాట్లాడుతూ దేశంలో బిజెపిని అతి పెద్ద పార్టీగా చేయడమే సభ్యత్వ నమోదు ఉద్దేశ్యమన్నారు. దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చడంలో ప్రతి కార్యకర్త ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు పరమేశ్వర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేష్, మాజీ సర్పంచ్ భోజి రెడ్డి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Related posts