పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
తిరుమలగిరి సాగర్ సెప్టెంబర్ 24(ప్రజాక్షేత్రం):కిశోర బాలికలు పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ అనుముల ప్రాజెక్టు సూపర్వైజర్ విజయలక్ష్మి అన్నారు. తిరుమలగిరి సెక్టార్ తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తూరిబా గాంధీ పాఠశాలలో నిర్వహించిన పోషణ మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
*పప్పు ధాన్యాలు రక్త హీనత నుండి కాపాడుతుంది.*
కిషోర్ బాలికలు రాగులు, సజ్జలు, జొన్నలు ,పండ్లు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు ఆహారంలో తీసుకుంటే రక్తహీనత లోపం ఏర్పడకుండా ఉంటుందన్నారు. అనంతరం కిశోర బాలికలు పోషకాహారం గురించి ఏ ఏ పదార్థాలు పోషక విలువలు అధికంగా ఉంటాయో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
*కిశోర బాలికల పెరుగుదలపై అంగన్వాడి పర్యవేక్షణ.*
కిషోర్ బాలికల పెరుగుదలపై ప్రతి అంగన్వాడి కేంద్రంలో పర్యవేక్షణ ఉంటుందని సూపర్వైజర్ యాదమ్మ, విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి గ్రామంలో జరిగిన హిమోగ్లోబిన్ టెస్ట్ మరియు పోషణ్ మహోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తహీనత మరియు పౌష్టిక ఆహార లోపం గురించి వివరంగా వివరించారు. పౌష్టికాహార లోపం లేకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరించారు. పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనంతరం బాలికల రక్త నమూనాలను స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు రక్తహీనత వల్ల కలిగే నష్టాలు పౌష్టికాహార లోపం పలు అంశాలు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శ్రీనివాస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, యాదమ్మ, అంగన్వాడీ టీచర్లు కళావతి, రమణ, పుష్ప, పాపమ్మ, ఏఎన్ఎం విజయ, ఉమాదేవి, ఆశా వర్కర్లు ఎల్లమ్మ ,నాగరాణి తదితరులు పాల్గొన్నారు.