Praja Kshetram
తెలంగాణ

పోచంపాడ్ గురుకుల విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీచర్ ను సస్పెండ్ చేయాలి.

పోచంపాడ్ గురుకుల విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీచర్ ను సస్పెండ్ చేయాలి.

-విద్యార్థి పై దాడిచేసిన టీచర్ రాజేశ్వర్ రెడ్డిపై ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి.

-విద్యార్థి సంఘాల డిమాండ్.

నిజామాబాద్ సెప్టెంబర్24(ప్రజాక్షేత్రం):మెండోరా మండలం పోచంపాడ్ గురుకుల పాఠశాలలో చదువుతున్న మూడు రాజు 6వ తరగతి విద్యార్థి శుక్రవారం రాత్రి సమయంలో బాత్రూం వస్తుందని వెళ్ళాడు అదే సమయంలో డ్యూటీలో ఉన్న టీచర్ రాజేశ్వర్రెడ్డి వాచ్మెన్ సురేష్ లో విద్యార్థి రూమ్ కి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళవని కోపంతో మాట్లాడుతూ విద్యార్థి రాజు పై విచక్షణ రహితంగా పైపుతో దాడికి పాల్పడ్డారు. అదే క్రమంలో విద్యార్థితో రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేను కొట్టినట్లు ఎవరితోనైనా చెబితే నిన్ను ప్రతిరోజు కొడతానని టిసి ఇచ్చి ఇంటికి పంపిస్తారని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరించడం జరిగింది. మరియు అదే క్రమంలో విద్యార్థి తండ్రితో ఫోన్లో అసభ్య పదజాలంతో కులం పేరుతో మాట్లాడడం జరిగింది. మరియు ప్రిన్సిపల్ విద్యార్థికి బెదిరిస్తూ చెప్పగా ప్రిన్సిపాల్ నిన్ను రోజు ఒక్క టీచర్తో కొట్టిపిస్తాను లేదా నువ్వు హాస్టల్ వదిలి పోయేలా చేస్తాను అని ప్రిన్సిపాల్ విద్యార్థిని బెదిరించడం జరిగింది. కావున రాజు అనే విద్యార్థిపై దాడి చేసిన టీచర్ రాజేశ్వర్ రెడ్డిపై ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని మరియు ఈ గురుకులంలో విద్యార్థులు వెళ్లిపోయిన వారి స్థానంలో వేరొక విద్యార్థికి సీట్లను అమ్ముకున్నట్లుగా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కావున తమరు సక్రమంగా విచారణ జరిపి విద్యార్థిపై దాడి చేసిన వారినిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలుగా కోరడం జరుగుతుంది.

Related posts