కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య❓
హైదరాబాద్ సెప్టెంబర్ 25(ప్రజాక్షేత్రం):రాజ్యసభ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో బుధవారం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించి నట్లు సమాచారం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆర్. కృష్ణయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో విద్యానగర్ లోని ఆర్, కృష్ణయ్య, నివాసానికి వెళ్లిన ఎంపీ మల్లు రవి, కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంఘం సంక్షేమ నాయ కులు చెబుతున్నారు. మల్లు రవి ఆర్,కృష్ణయ్యతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఆర్.కృష్ణయ్య చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి.