Praja Kshetram
తెలంగాణ

ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పట్టించుకున్న నాధుడు లేడు.?

ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పట్టించుకున్న నాధుడు లేడు.?

–ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు.

–చౌరస్తాలోని రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో ప్రమాదాలు

–ప్రమాదకరమైన ఒక డెత్ స్పాట్ గా పోచంపాడ్ చౌరస్తా

–ఇకనైనా అధికారులు పట్టించుకోవాలని ప్రయాణికులు మొర పెట్టుకుంటున్నారు.

నిజామాబాద్ సెప్టెంబర్ 25(ప్రజాక్షేత్రం):పోచంపాడ్ చౌరస్తా కు వెళ్తున్నారా అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. ఎవడు ఎక్కడి నుండి వచ్చి ప్రమాదాలకు గురిచేస్తారో తెలియదు.పోచంపాడ్ చౌరస్తా అసలే ప్రమాదకరమైన ఒక డెత్ స్పాట్ లాంటిది.ఇక్కడ ఎంతోమంది మహిళలు యువకులు పురుషులు ప్రాణాలు వదిలేశారు.చౌరస్తాలోని రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో.వెనుక నుండి వచ్చినవారు చూసుకోలేక ఈ వాహనాలు అడ్డంగా ఉండడంతో వారు నేరుగా వచ్చి ఢీకొడుతున్నారు.మరి దీనికి ఎవరు బాధ్యులు.మా ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు.ఈ పోచంపాడ్ చౌరస్తాలో అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలను గాలిలో వదిలేశారు.ఇదే మన కుటుంబ సభ్యులకు జరిగితే మనం ఇలా చూస్తూ ఊరుకుంటామా ఇప్పటికైనా ఎన్ హెచ్ 44 వారు పోలీస్ శాఖ నిరంతరం ఈ రోడ్డుపై నిలిపిన వాహనాలని ఇక్కడ నింపకుండా వాహనాలపై ఒక దృష్టి సారించాలని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని అన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related posts