హైదరాబాద్ రోడ్లపై రొమాన్స్.. బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో
హైదరాబాద్ సెప్టెంబర్ 25(ప్రజాక్షేత్రం): యూత్ బైక్ స్టంట్లు చేయడం కామన్ అయిపోయింది. ఇటీవలి కాలంలో బైక్‌లపై ప్రేమ విన్యాసాలు ఎక్కువై పోయాయి. ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ప్రేమికులు బైక్‌లపై విహరిస్తూ రొమాన్స్ లో మునిగిపోయిన ఘటనలు అనేకం చూశాం. ఇప్పుడు ఆ సంస్కృతి హైదరాబాద్ కు పాకిపోయింది. సాధారణంగా పార్కుల్లో కనిపించే రొమాన్స్ సీన్లు ఇప్పుడు నడి రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి. బరితెగించిన ఓ ప్రేమ జంట.. ముద్దుల్లో మునిగిపోయి, కౌగిలింతలతో రెచ్చిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిపై వెలుగు చూసింది. ఇక ప్రియుడు బైక్ నడుపుతుంటే.. ప్రియురాలేమో పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి ఎదురుగా కూర్చుంది. హెల్మెట్ ధరించి ఉన్న తన ప్రియుడికి ముద్దులు పెడుతూ.. చిరునవ్వులు చిందించింది. అంతటితో ఆగకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకుంటూ సంబురపడిపోయింది. ఈ ప్రేమికుల బరితెగింపు చేష్టలకు రోడ్డున పోయేవారు అవాక్కయ్యారు. ప్రియుడు కూడా ఆమెకు సహకరిస్తూ.. సరసాల్లో మునిగిపోయాడు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ ప్రేమికుల విన్యాసం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
