కొండాపూర్ మండలం మల్కాపూర్లో హైడ్రా కూల్చివేతలు.
కొండాపూర్ సెప్టెంబర్ 26(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లోని పెద్ద చెరువుకు సంబంధించిన ఎస్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. ఉదయం భారీ బందోబస్తుతో గ్రామానికి చేరుకున్న అధికారులు చెరువులో అక్రమ నిర్మాణాన్ని బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. శిథిలాలు ఎగిరిపడి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు గోపాల్ తలకు గాయాలయ్యాయి. వారిని కొండాపూర్ పోలీస్ సిబ్బంది సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
