Praja Kshetram
క్రైమ్ న్యూస్

డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ.  

డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ.

 

హైదరాబాద్, సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో చోరీ జరిగింది. బంజరాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భట్టి ఇంట్లో ఇద్దురు దుండగులు దొంగతనానికి పాల్పడారు. సమాచారం అందుకున్న బంజరాహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీటీవీ పూటేజీని పరిశీలించారు. దుండగులు బిహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ గా గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.2 లక్షల నగదు, 100గ్రా. బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related posts