రెండు స్కూల్ బస్సులు ఢీకొని డ్రైవర్ మృతి.
మెదక్ జిల్లా సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బి.వి.ఆర్.ఐ.టి కళాశాలకు చెందిన రెండు బస్సులు నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రమాద తీవ్రత ఎంతైనా, గాయపడిన విద్యార్థులందరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ రెండు బస్సులు బి.వి.ఆర్.ఐ.టి. కళాశాలకు చెందినవే కావడం, వాటిలో విద్యార్థులు ప్రయాణిస్తుం డటం పెద్ద విషాదాన్ని కలిగించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర ప్రయాణికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే అంబులెన్స్‌లు అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రులకు తరలించారు.