Praja Kshetram
తెలంగాణ

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం రేవంత్.

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం రేవంత్.

 

హైదరాబాద్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ము నేడు పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద్ర, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనున్నారు. రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ముర్ము ప్రారంభించనున్నారు.

Related posts