శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 17, 14 కబడ్డీ జోనల్ స్థాయి పోటీలు.
-కబడ్డీ పోటీ లలో పాల్గొన్న 500 మంది విద్యార్థులు విద్యార్థులు.
శంకర్ పల్లి సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో శనివారం జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో షాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలలో 500 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 17 బాలుర పోటీలలో మొదటి బహుమతి శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలకు రాగా, రెండో బహుమతి షాబాద్ మోడల్ స్కూల్ కు లభించింది. అండర్ 17 బాలికల కబడ్డీ పోటీలలో శంకర్ పల్లి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలకు లభించింది, రెండవ బహుమతి శంకర్ పల్లి మండలం పరివేద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లభించింది. అండర్ 14 బాలికల పోటీలలో సత్యసాయి స్కూల్ మొదటి బహుమతి రాగా, రెండో బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు లభించింది. ఈ ఆకుల పోటీలకు ముఖ్యఅతిథిగా శంకర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జున్ కుమార్ పాల్గొన్నారు. వచ్చిన విద్యార్థులకు చేవెళ్ల రాజు అన్నదాన వితరణ చేశారు. బహుమతులను బాబు నాయక్ అందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ ప్రభాకర్, అరుంధతి, బసవరాజు, బిక్షపతి, కవ్వ గూడెం శ్రీను, శంకర్, పల్లవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.