Praja Kshetram
తెలంగాణ

డిజిటల్ మీడియా సమస్యలు పరిష్కరించాలి.

డిజిటల్ మీడియా సమస్యలు పరిష్కరించాలి.

 

-డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టుగా గుర్తించాలి.

-ప్రతి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్కడేషన్ కార్డు ఇవ్వాలి.

-మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.

-డి యం జె యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కాడిగల్ల ప్రవీణ్ కుమార్.

శంకర్ పల్లి సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):ఆదివారం శంకర్ పల్లి స్థానిక అతిథి గృహంలో డి యం జె యు నాయకుల సమావేశం జరిగింది. త్వరలో డి యం జె యు మండల నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుందని రాష్ట్ర సహాయ కార్యదర్శి కాడిగల్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక సామాజిక మాధ్యమాలలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రస్తుతం డిజిటల్ మీడియా అనివార్యం అయింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పటి సమాచారాన్ని అప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. డిజిటల్ మీడియా అవసరం అందరికి తెలిసిందే గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసిన జర్నలిస్టులు వారి వ్యక్తిగత పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు పరుగులు తీస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ డిజిటల్ మీడియాలో రిపోర్టింగ్ చేస్తున్న వారిపై దాడులు చేస్తూ డిజిటల్ మీడియాను చులకనగా చూస్తున్నారు. ఈ రోజు డిజిటల్ మీడియా ప్రాముఖ్యత సంతరించుకుంది. సాటిలేట్ మీడియాకు కూడా అనివార్యంగా డిజిటల్ మీడియా అవసరం ఏర్పడింది. నిరంతర వార్తలు కవర్ చేస్తూ డిజిటల్ మీడియాలో టెలికాస్టింగ్, పబ్లిషింగ్ చేస్తున్న వారందరిని ప్రభుత్వం మీడియా అకాడమి మరియు ఐ&పిఆర్, డి పి ఆర్ ఓ లు గుర్తించి డిజిటల్ మీడియాలో పని చేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో డి యం జె యు నాయకులు రాజేశ్ గౌడ్, దుర్గ ప్రసాద్, మైపాల్ రెడ్డి, పరమేష్, సునిల్ గౌడ్, ఆనంద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts