బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న విలేఖరికి దేహ శుద్ధి చేసిన ప్రజలు
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 29(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాలో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్ సంతోష్ నాయక్ ను బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి స్థానిక ప్రజలు చితకబాదారు. వివరాల్లోకి వెళితే… అమీన్ పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాలో ఇండ్ల నిర్మాణం సరిగ్గా లేవని చెప్తూ ఊరిలో ఉన్న ఇండ్ల ఫోటోలు తీస్తూ ఇంటికి 25,000 ఇవ్వాలని, లేకుంటే ఇండ్లు కులగొట్టించే విధంగా చేస్తానని బెదిరించడంతో ఒక్కటైనా స్థానికులు రిపోర్టర్ ను పట్టుకొని బట్టలు ఊడదీస్తి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇలాంటి వారి వల్ల యావత్ రిపోర్టర్లకు చెడ్డ పేరు వస్తుందని పలువురు విలేకరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పత్రికా రంగంలో కనీస అవగాహన లేని కొందరు వ్యక్తులు రిపోర్టర్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ నిఘా పెట్టాలని పలువురు పేర్కొన్నారు.