స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి
ముస్తాబాద్ సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్‌లో స్కూల్ బస్సు కిందపడి మూడేండ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పాప మృతికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు మహర్షి స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. బంధువుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, అప్పటి వరకు కండ్లముందే కదలాడిన చిన్నారి అంతలోనే మృత్యు ఒడిలోకి చేరడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.