పర్వెద గ్రామ మాజీ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ ను ఘనంగా సన్మానం.
శంకర్ పల్లి సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం పర్వేద గ్రామ మాజీ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ ఆ గ్రామంలో చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు నెల ఆ గ్రామంలో 25 మందికి నెలకి 2000 వితంతు పెన్షన్ సొంత నిధులతో ఇస్తున్నాడని తెలుసుకొని బి ఆర్ ఎస్ యువ నాయకులు మహ్మద్ నవాజ్ వారికి సన్మానించడం జరిగింది. ఇలాంటి పలు సేవలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాడిగల్ల ప్రవీణ్ కుమార్, హన్మగల్ల ప్రవీణ్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.