జార్ఖండ్‌లో రైల్వేట్రాక్పై పేలుడు.. ఎగిరిపడ్డ రైల్వేట్రాక్
జార్ఖండ్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం): జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై బుధవారం భారీ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. రైల్వేట్రాక్పై ఆగంతకులు పేలుడు పదార్థులు అమర్చారు. పేలుడు ధాటికి 39 మీటర్ల దూరం రైల్వేట్రాక్ ఎగిరిపడి, మూడు అడుగుల గొయ్యి పడింది. సాహిబ్‌గంజ్ జిల్లా బార్హెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగ ఘుట్టు గ్రామానికి సమీపంలో లాల్మాటియా నుంచి ఫరక్కా వెళ్లే ఎంజీఆర్ రైలు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడుకు ఉపయోగించిన పదార్థాలను తెలుసుకోవడానికి ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని పిలిపించామని ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు త్వరలోనే ఓ నిర్ధారణకు వస్తారని సింగ్ చెప్పారు. అయితే, ఈ చర్య వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ మార్గం గొడ్డాలో లాల్మాటియా నుండి ఫరక్కా వరకు బొగ్గు రవాణాకు ఉపయోగించబడుతోందని పోలీసులు తెలిపారు.