Praja Kshetram
తెలంగాణ

గుడికి వెళ్దాం.. బిర్యాని తిని వద్దాం ..!

గుడికి వెళ్దాం.. బిర్యాని తిని వద్దాం ..!

 

-విద్యార్థినిపై రికార్డ్ అసిస్టెంట్ లైంగిక వేధింపులు.

-ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘటన.

నాగర్ కర్నూల్ అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):బాలికల కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థినితో గుడికి వెళ్దాం బిర్యాని తిని వద్దాం అంటూ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం వెలుగు చూసింది. దీనిపై విద్యార్థిని వారి తల్లిదండ్రులకు వివరాలు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. షీ టీమ్ ఇంచార్జ్ వెంకటయ్యతో వారి బృందం కళాశాలలో వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

Related posts