Praja Kshetram
తెలంగాణ

నాగార్జున సాగర్‌లో హైడ్రా తరహా కూల్చివేతలు..

నాగార్జున సాగర్‌లో హైడ్రా తరహా కూల్చివేతలు..

 

–పేదల కడుపు కొడుతున్న రేవంత్ సర్కార్ అంటూ మండిపడుతున్న బాధితులు…

–పేదోళ్ల ఇండ్లను కూల్చివేస్తున్న మునిసిపల్ అధికారులు …

పెద్దవూర అక్టోబర్ 04(ప్రజాక్షేత్రం):నాగార్జున సాగర్ మున్సిపాలిటీలో హైడ్రా తరహాలో పేదల ఇండ్లను మున్సిపాలిటీ సిబ్బంది గునపాలతో కూల్చి వేస్తున్నారు. నాగార్జున సాగర్ పైలాన్ కు చెందిన ముడావత్ లక్ష్మణ్ ఇంటిపై 20 మంది మున్సిపల్ సిబ్బంది ప్రవేశించి ఇంటిని కూల్చి వేస్తున్నారు. సాగర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చెస్తూ మున్సిపల్ అధికారులు దౌర్జన్యానికి గురవుతున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా తమ జాగాలో నిర్మాణం చేపడుతున్న బీదవారికి సంబంధించిన ఇంటిని మున్సిపల్ కమిషనర్ శ్రీను అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎటువంటి సమాచారం లేకుండా తమ సిబ్బందితో వచ్చి కూల్చివేయడం అమానుషమని మొర పెట్టుకుంటున్నా వినడం లేదని ప్రజలు ఆరోపించారు.

Related posts