Praja Kshetram
తెలంగాణ

యతి నర్సింహానంద్‌పై ఏఐఎంఐఎం ఫిర్యాదు.

యతి నర్సింహానంద్‌పై ఏఐఎంఐఎం ఫిర్యాదు.

 

హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హరిద్వార్ పూజారి యతి నర్సింహానందపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి వచ్చిన ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ… యతి నర్సింహానంద్ గతంలో విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి జైలుకెళ్లారని, అలాంటి వ్యాఖ్యలు చేయకూడదనేది బెయిల్ షరతుల్లో ఒకటి అన్నారు. అందుకే, యతి నర్సింహానంద్ బెయిల్‌ను రద్దు చేయాలని ఏఐఎంఐఎం డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. నర్సింహానంద్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. నర్సింహానంద్ పై దేశవ్యాప్తంగా 50 ఎఫ్ఐఆర్ లు నమోదుయ్యాయి. హైదరాబాద్ లోనూ ఎంఐఎం ఆధ్వర్యంలో నిరసనలు చేలరేగాయి. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిరసనలకు పిలుపునిచ్చారు.

Related posts