Praja Kshetram
తెలంగాణ

చేవెళ్లలో ఘనంగా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం.

చేవెళ్లలో ఘనంగా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం.

 

-ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం.

-పాల్గొన్న రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్, పరిగి ఎమ్మెల్యే లు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్.

చేవెళ్ల అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలో జరిగిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. అనంతరం శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాలకు బాటలు వేస్తారని అన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబుకు ఎల్లవేళలా అండగా నిలుస్తాం అని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా గురువులకు నమస్కారాలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు అని సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువలతో కూడుకున్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయో అనే అంశాన్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆలోచించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో నూతన విద్యా విధానం తెస్తాం అని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అందుకు క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందని, జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు దసరాలోపే మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలను కేటాయించే అంశం సిఎం కు నివేదిస్తామని అన్నారు. అనంతరం పరిగి, తాండూర్, శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిలు ఉపాధ్యాయులను, ఎమ్మెల్యే యాదయ్య ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, చేవెళ్ల నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts