పల్లెల్లో దొరల అహంకారం మారలేదు.
–ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇంఛార్జి అంబాల చెంద్రమొగిలి.
భూపాలపల్లి అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా పల్లెల్లో ఇంకా దొరల అహంకారం, పెత్తందారుల వైఖరి మారడంలేదని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి అంబాల చెంద్రమొగిలి ఆరోపించారు. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళల ఇల్లును ఇదే గ్రామానికి చెందిన కొందరు పెత్తందారుల వర్గానికి చెందిన దొరలు కూల్చడంపై మండిపడ్డారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చిన్నపెళ్లి రమాదేవి, చిన్న పెళ్లి రాజేశ్వరి, వారి కూతురు వికలాంగురాలు రుద్రారం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్నారని, వీరు పూసవేర్ల వర్గానికి చెందిన నిరుపేదలు జీవన విధానం కోసం గాజులు అమ్ముకుంటూ బతుకుతున్న నేపథ్యంలో రామినేని రాజారావు, రామినేని భాస్కరరావు అనే వ్యక్తులు ఇల్లును కూల్చడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూల్చుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన,పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు డబ్బాలో ఆందోళన చేసిన పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులు పేదల వైపు కాకుండా పెత్తందారుల వైపు ఉండడం సరికాదన్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోని పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి జిల్లా నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొల్లి బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మారుపాక లచ్చయ్య మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు కేసారపు నరేశ్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ, వేమునూరు జక్కయ్య మాదిగ, దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు సంపత్ మాదిగ, మోతే సమ్మయ్య మాదిగ,కాటారం మండల అధ్యక్షులు మంథని చిరంజీవి మాదిగ, మహా ముత్తారం మండల అధ్యక్షులు పులియాల రాజయ్య మాదిగ పాల్గొన్నారు.