Praja Kshetram
క్రైమ్ న్యూస్

ముంబైలో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

ముంబైలో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

 

మహారాష్ట్ర అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):ముంబయిలోని రెండంతస్తుల షాప్‌ కమ్‌ రెసిడెన్షియల్‌ లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా ఏడుగురు సజీవదహనం అయినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. చెంబూర్ ఈస్ట్ ఏఎన్ గైక్వాడ్ మార్గ్‌లోని సిద్ధార్థ్ కాలనీలో ఉదయం 5.20 గంటలకు ఈ ఘటన జరిగింది. బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ నుండి ప్రాథమిక సమాచారం ప్రకారం, కింద దుకాణం నడుపుతూ పై ఇంట్లో కుటుంబం నివాసం ఉంటోంది. షాపులోని ఎలక్ట్రిక్ వైరింగ్, ఎలక్ట్రిక్ ఇన్‌స్టాలేషన్‌లో మంటలు ఇతర గృహోపకరణాలకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని రాజావాడి ఆసుపత్రికి తరలించగా, వారందరూ చనిపోయినట్లు ప్రకటించారని అధికారి తెలిపారు. మృతులను పారిస్ గుప్తా (7), మంజు ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (39), ప్రేమ్ గుప్తా (30), నరేంద్ర గుప్తా (10)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

Related posts