Praja Kshetram
తెలంగాణ

పెంకుటిల్లు కూలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

పెంకుటిల్లు కూలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

 

–అర్ధరాత్రి అకస్మాత్తుగా ఇల్లు కూలడంతో వృద్ధురాలుకి,బాలుడికి తీవ్ర గాయాలు.

–ఉన్న కాస్త గూడు కూలడంతో రోడ్డున పడ్డ కుటుంబీకులు

–ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఓ పెంకుటిల్లు కూలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆలూర్ గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో కొండపల్లి(గోసంగి) గంగు మనుమడు నిద్రపోతున్నారు.మరోవైపుకి కోడలు కొడుకు కొండపల్లి భూమేష్ పిల్లలు పడుకున్నారు.ఒక్కసారిగా ధన్నుమని శబ్దం వచ్చింది పెద్దకొడుకు భూమేష్ చూడగా అమ్మ గంగు కొడుకు ఇద్దరు మట్టిలో కూడుకుపోయారు వారిపైన మట్టి కునపెంకులు దూలం, కట్టెలు పడి తీవ్ర గాయాలయ్యాయి.దీన్ని గమనించిన భూమేష్ ఒక్కసారిగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచాడు.మట్టిలో నుండి వారిని బయటకు తీశారు.కొద్దిగా ఆలస్యం అయితే వారి ప్రాణాలు పోయేవని తెలిపారు.ఇదిలా ఉండగా భార్య పైన పిల్లల పైన కూడా మట్టికూల్లడంతో వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై దయ తలిచి వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరారు.గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నాయకులు మాజీ సర్పంచ్ కళ్ళేమోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్ వారిని పరామర్శించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీకు ప్రభుత్వంచే ఇల్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Related posts