ఆయనే సమర్ధుడు అంటున్న మెజార్టీ వర్గాలు,అభిమానులు అధిష్టానం పరిశీలనలో లాల్ సింగ్ నాయక్.
-త్వరలోనే అధికారిక ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 07(ప్రజాక్షేత్రం):అతనొక గిరిజన నాయకుడు ఉన్నత విద్యను అభ్యసించి అతి చిన్న వయసులోనే రాజకీయ చతురతులు నేర్చుకొని తన యొక్క బలమైన గొంతుతో అధికార బి ఆర్ ఎస్ పార్టీకి ధీటుగా రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో కొత్తగూడెం రేవంత్ రెడ్డి అని పిలుచుకునేలా రేవంత్ రెడ్డి జన్మదిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ భవిష్యత్తు నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే వెంటనే తనదైన శైలిలో స్పందిస్తూ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించేవాడు లాల్ సింగ్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏ నాయకుడి మద్దతు లేకుండా ఎవరి సపోర్టు సహకారాలు పొందకుండా సొంతంగా తానే ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని ఎందరో నాయకులను తయారుచేసి సొంత వర్గాన్ని ఏర్పరచుకొని నిత్యం ప్రజా సమస్యలపై రాజీలేని కార్యక్రమాలు ద్వారా పరిష్కారం చూపుతూ ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు బెదిరింపులకు ఎలాంటి కేసులకు తలోగ్గకుండా తనదైన శైలిలో యువకులకు ఆదర్శంగా నిలిచి మెజార్టీ గిరిజన ప్రజల మద్దతు పొంది బలమైన నాయకుడిగా తనకంటూ రాజకీయాల్లో కొత్త గుర్తింపు సంపాదించారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో లాల్ సింగ్ నాయక్ అత్యధికంగా ప్రీవియెంట్ అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో నిద్రిస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మెజార్టీ వర్గాల నాయకుడైన లాల్ సింగ్ నాయక్ కె కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో ఆయనను కూర్చోబెట్టి ఆలోచనలో ఉన్నట్లు గాంధీభవన్లో చర్చ జరుగుతుంది ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన లాల్ సింగ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తల చర్చ ఎందరినో ఆనందపరుస్తుంది అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో నిస్వార్ధంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండదండగా ఉండే నాయకత్వ లక్షణాలు కలిగి అతను అతి తక్కువ కాలంలోనే ఫోటో లీడర్ కాదు ఫైటర్ అని ప్రత్యేక గుర్తింపు పొందాడు క్రమశిక్షణ నిజాయితీ అన్ని విధాలుగా సమర్ధుడు లాల్ సింగ్ నాయక్ అని అంటున్నారు ప్రధానంగా బీదలకు అణగారిన వర్గాలకు అండగా చాలా రోజుల తర్వాత ఒక నాయకుడి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది మొదటి నుంచే లాల్ సింగ్ నాయక్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేవాడు అతని పేరు చెప్తే అవినీతిపరులకు ఆర్థిక నేరస్తులకు వెన్నుల్లో వణుకు పుడుతుంది ప్రతి పేదవాడికి సామాన్యుడికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చూపేవాడు ఇంతకాలం ఎలాంటి పదవి హోదా లేకున్నా ఎన్నో జఠిలమైన సమస్యలు పరిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన లాల్ సింగ్ నాయక్ వెంటే మేము అంటున్న అభిమానులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెజార్టీ గిరిజనులు.