Praja Kshetram
తెలంగాణ

రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు.

రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు.

 

శంకర్‌ పల్లి అక్టోబర్ 07 (ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ నూతన చైర్మన్ గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ఇటీవల నియమితులయ్యారు. శంకర్‌పల్లి మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, పూల బోకే ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. ఆయనను కలిసిన వారిలో మండల సొసైటీ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాశెట్టి మోహన్, గోవర్ధన్ రెడ్డి, రవీందర్ ఉన్నారు.

Related posts