Praja Kshetram
తెలంగాణ

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి 115 దరఖాస్తుల స్వీకరణ.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి 115 దరఖాస్తుల స్వీకరణ.

-జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

వికారాబాద్ అక్టోబర్ 07 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లింగ్యా నాయక్ తెలిపారు.సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లింగ్యా నాయక్, అదనపు కలెక్టర్ (స్తానిక సమస్థలు )సుదీర్, గార్లతో కలిసి స్వీకరించారు. సోమవారం ప్రజావాణిలో మొత్తం (115) దరఖాస్తులు రాగా, భూ సమస్యలు, ఇతర సమస్యల కు సంబంధించి ధరఖాస్తులు వచ్చాయని, స్వీకరించిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసు చంద్ర , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts