హైమాస్ లైట్స్ వెలగక వీధి మొత్తం అంధకారం
-మండల కేంద్రంలోని కలిమిల షాప్ ముందర పరిస్థితి ఇది..!
-పలుమార్లు చెప్పిన పట్టించుకోని పంచాయతీ సిబ్బంది.
పెద్దేముల్ అక్టోబర్ 07(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలోని పదో వార్డు, కలిమిల కిరాణా షాప్ ముందర హైమాస్ లైట్స్ వెలగక వారం రోజులు గడుస్తున్నా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది. దీంతో వీధి మొత్తం అంధకారంతో దర్శనమిస్తోంది. కాలనీవాసులు పలుమార్లు కారొబర్ కు తెలియజేసిన, ఇప్పటివరకు మరమత్తులు చేయించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాలనీలో.. కళ్ళు దుకాణాలు, కిరాణా షాపులు ఉన్నాయి. ప్రతిరోజు జనాలు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇదే దారి గుండా.. బస్టాండ్ వెళ్తారు. మరియు నిత్యం అటు నుంచి వందల సంఖ్యలో జనాలు తిరుగుతూ ఉంటారు. సాయంత్రం అయ్యిందంటే కింద ఏమి కంపిస్తలేదు అంటూ వృద్ధులు బిక్కు బిక్కు మంటున్నారు. దీంతో కింద పడే ప్రమాదం ఉంది అటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి హైమాస్ లైట్ కు సంబంధించిన మరమ్మత్తులు చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.