వెన్నెలపాలెం నూతన కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించిన కె. భారతి
పరవాడ అక్టోబర్ 07(ప్రజాక్షేత్రం):పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామపంచాయతీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శి భారతి మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తిని మర్యాదపూర్వకంగా కలిసారు. బండారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన ద్రుష్టి పెట్టాలని త్రాగు నీరు, కాలువల సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు . భారతి మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన అనుభవం ఉందని గ్రామ పంచాయతీలో నీటి, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూసుకుంటానని తెలిపారు. ఈవిడ ఇంతకుముందు జి. మాడుగుల మండలం కుంబిడిసింగ్ గ్రామ పంచాయితీలో పనిచేసారు. ఈ కార్యక్రమంలో వెన్నెలపాలెం కూటమి నాయకులు పైల రతాల సన్యాసిరావు (ఎక్స్ యంపిటిసి), పైల వరలక్ష్మి (మహిళా అధ్యక్షురాలు), గోంప మరునాడు (గ్రామ కమిటీ అధ్యక్షుడు), బండారు వీరు నాయుడు (గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి) మరియు టిడిపి నాయకులు లోకిరెడ్డి సన్యాసినాయుడు(అభి), పైల ప్రసాద్, బోజంకి అప్పలనాయుడు, వెన్నెల గిరి, వెన్నెల ప్రసాద్ ఎల్ ఐ సి, మాసవరపు నాగేష్ తదితరులు పాల్గున్నారు.