వరంగల్ తహశీల్దార్ పై దాడి
–ఎనుమాముల పోలీస్ స్టేషన్ లో తహశీల్దార్ పిర్యాదు.
వరంగల్ అక్టోబర్ 08(ప్రజాక్షేత్రం):వరంగల్ మహ నగర పాలక సంస్థ పరిధి 14 వ డివిజన్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు చేసే నిమిత్తం తమ సిబ్బందితో మంగళవారం వెళ్ళగా ఎస్ఆర్ నగర్ కు చెందిన ఒక బీఅర్ఎస్ లీడర్ అక్కడ ఉన్న ప్రజలను ఉసిగొల్పి హైడ్రా పేరుతో తహశీల్దార్ ఇండ్లు కూల్చాడానికి వస్తున్నారని ప్రజలకు అసత్య ప్రకటన ప్రచారం చేసి తమ పైన దాడి చేశారని స్థానిక తహశీల్దార్ ఇక్బాల్ తెలిపారు. వరంగల్ మండల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.విధి నిర్వహణ కోసం వెళ్లిన వరంగల్ ఎమ్మార్వో ను ఎస్ఆర్ నగర్ కాలనీవాసులు అడ్డుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎస్సార్ నగర్ బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి సిబ్బందితో వెళ్లినమని అన్నారు. ఒక టీఅర్ ఎస్ లీడర్ ప్రభుత్వ స్థాలనికి ఇంటి నంబర్ తీసుకొని రిజిస్ట్రెషన్లు చేపిస్తున్నాడని తమకు తెలిసిందని చెప్పారు.తమ పై దాడికి పాల్పడ్డ వారిపై ఎనుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మని వరంగల్ ఎమ్మార్వో తెలిపారు. తమ పైన జరిగిన దాడి గురించి కలెక్టర్ కు తెలిపినామని అన్నారు.