Praja Kshetram
తెలంగాణ

పీడీఎస్ బియ్యం పట్టివేత

పీడీఎస్ బియ్యం పట్టివేత

 

– రైస్ మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.

– డీసీఎం నిండా సంచుల్లో బియ్యం.

– బియ్యం ఎక్కడివి అని పోలీసుల ఆరా.

మాక్లూర్ అక్టోబర్ 08(ప్రజాక్షేత్రం):మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని అధికారులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాస్ నగర్ సమీపంలో గల మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో మధ్యాహ్న సమయంలో నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, స్థానిక పోలీసులు జాయింట్ ధనికులు నిర్వహించి డీసీఎం నిండా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత బియ్యం ఎక్కడివి అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. పీడీఎస్ బియ్యం రెగ్యులర్ గా రైస్ మిల్లుకు సరఫరా చేస్తారా అని అనుమానం వ్యక్తం చేస్తునట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం తెచ్చిన వారు రెగ్యులర్ గా సరఫరా చేస్తాం అని తెలుపుతున్న , సంబంధిత యజమాని కావాలని పీడీఎస్ బియ్యం లోడ్ రైస్ మిల్లుకు తెచ్చి బ్లాక్ చేస్తున్నారనీ అంటున్నట్లు సమాచారం. ఈ విషయం పై పోలీసులు సుమారు నాలుగు గంటలుగా ఆరా తీస్తున్న నిగ్గు తేల్చట్లేదు. పూర్తి వివరాల గురించి సంప్రదించగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనీ, పూర్తి వివరాలు తెలియలేదని వెల్లడిస్తున్నారు. ఈ రైస్ మిల్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సోదరుడు నిరంజన్ కు సంబంధించినదని, వారిపై కేసులు కాకుండా చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి నాలుగు గంటలుగా ధనికులు నిర్వహించిన అధికారులు ఎటు తేల్చలేకపోయారు. విచారణ చేపడుతున్నామని సందనం ఇచ్చి జారుకున్నారు.

Related posts