Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పట్నం

ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పట్నం

 

 

హైదరాబాద్ అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం): శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శాసనమండలిలోని తన ఛాంబర్ లో పట్నం మహేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా, పార్టీ శాసనసభ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కీలకమైన ఓట్ల సమయంలో పార్టీ సభ్యులు ఉండేలా చూసుకోవడం, శాసనసభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహిస్తారు. చీఫ్‌విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్‌రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts