కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు
కొడంగల్ అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎమ్మార్వో ఆఫీసు వరకు పట్నం నరేందర్ రెడ్డి బుధవారం మహా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలనే ఉద్దేశంతో తుంకిమెట్ల వద్ద పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అడ్డగించారు. పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కొడంగల్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి షాద్‌నగర్‌వైపుగా తీసుకెళ్లారు.