Praja Kshetram
తెలంగాణ

చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపి చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్

చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపి చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్

 

చేవెళ్ల అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని నియమిస్తున్నట్లు అక్టోబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారి చేసింది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బుధవారం ఉదయం శాసన మండలిలోని తన ఛాంబర్ లో చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన భీమ్ భరత్ మరియు వీరితో పాటుగా గుడిమాల్కపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి.వెంకట్ రెడ్డి మొయినాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మాణయ్య కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, లావణ్య శ్రీనివాస్, నాయకులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts