Praja Kshetram
క్రైమ్ న్యూస్

బొగ్గు లారీ ఢీకొని ఒకరు మృతి

బొగ్గు లారీ ఢీకొని ఒకరు మృతి

 

– అనాథలైన ముగ్గురు చిన్నారులు

– అతివేగం, ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీలు

– అదుపు చేయడంలో అధికారులు విఫలం

– న్యాయం చేయాలని రోడ్డుపై ఆందోళన

మల్హర్ రావు అక్టోబర్ 09 (ప్రజాక్షేత్రం):మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి నుంచి నిత్యం బొగ్గు రవాణా చేస్తున్న లారీలు అడ్డు అదుపు లేకుండా అతివేగం, ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు అడుగడుగునా ధ్వంసం కావడమే కాక మనుషుల, ముగజీవాల ప్రాణాలు సైతం గాల్లో కలుస్తున్న పరిస్థితి. బొగ్గు టిప్పర్ల వేగానికి గతంలో మల్లారం, తాడిచెర్ల, రావుపల్లి గ్రామాల్లో పదుల సంఖ్యలో ముగాజీవాలు మృత్యువాత పడి, పలువురికి ప్రమాదాలైన సంఘటనలు కోకొల్లలు. ఇన్ని ప్రమాదాలు జరిగిన సంబంధించిన అధికారులు మామూళ్లకు తలోగ్గుతున్నారే తప్పా ఏనాడు బొగ్గు లారీలపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ సంఘటనలు మరువకముందే మంగళవారం రాత్రి10 గంటలకు బొగ్గులారీ అతివేగంతో మల్లారం ఉరచేరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో గొడిసెల శ్రీకాంత్ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుని స్వగ్రామం పెంచికల్ పేట అతను ఓసిపిలో మూడేళ్ళుగా సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ తాడిచెర్లలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం విధులు ముగించుకొని అత్తిలైనా చిన్నతూండ్ల గ్రామానికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో మృతుని ముగురు ఐదేళ్ల లోపు చిన్నారులు, భార్య సౌoదర్యలు అనాదలైయ్యారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి న్యాయం చేయాలని బుధవారం మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తాడిచెర్ల-కొయ్యుర్ రోడ్డుపై ఆందోళన చేపట్టి, బైఠాయించారు.

Related posts