Praja Kshetram
తెలంగాణ

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గృహ నిర్బంధం  

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గృహ నిర్బంధం

 

 

రంగారెడ్డి, అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా, రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అయితే పట్నం నరేందర్‌రెడ్డి పాదయాత్రకు వెళ్లకుండా ఉండేందుకు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనిలో సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సబితాను బయటకు రాకుండా ఇంటిముందు పోలీసులు మోహరించారు.

Related posts