పోచంపాడ్ రిపోర్టర్ పై దాడి
నిజామాబాద్ అక్టోబర్:09(ప్రజాక్షేత్రం):మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో గల షురూ ఆప్ మరియు కెఆర్5 న్యూస్ రిపోర్టర్ పై అర్ధరాత్రి దాడి చేశారు.రిపోర్టర్ బిల్లల్ ఇక్కడ ప్రాంతాల వార్తలు నిజాయితీగా నిక్కచ్చితంగా వ్రాస్తున్నందుకు పోచంపాడ్ కు చెందిన దిశా రిపోర్టర్ నరేందర్,మరియు కాంగ్రెస్ నేత చందు, అర్జున్ బిజెపి నేత సంగీత్,మాజీ ఉపసర్పంచ్ సతీష్ లు రిపోర్టర్ బిల్లల్ పై నిన్న రాత్రి దాడికి పాల్పడ్డారు.ఊరు విషయాలు ఏమి నువ్వు రాయకూడదని ఒకవేళ రాస్తే నిన్ను నరికి చంపి గంగలో పడేస్తానని వారు బెదిరించారు.ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఒక రిపోర్టర్ అయి సాటి రిపోర్టర్ మీద దాడి చేయడం బాధాకరమైన విషయం.ముత్యాల సునీల్ రెడ్డి వార్తలు నేనే రాస్తాను నువ్వు రాయకూడదు అంటూ దాడి చేశారు.అలాగే 10 గంటలలో ఊరు విడిచి వెళ్లిపోవాలని బెదిరించడం దిశా రిపోర్టర్ నన్ను భయభ్రాంతులకు గురి చేశాడని వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.