మమిషన్ భగీరథలో కుళ్లిపోయిన కోతిశవం.
–వారం రోజుల నుంచి నీళ్లు తాగుతున్న గ్రామస్తులు.
–పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం..
కుభీర్ అక్టోబర్ 10(ప్రజాక్షేత్రం):కుళ్లిపోయిన కోతి మృత దేహం కుభీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో నెలకొంది. గత కొన్ని రోజులుగా భగీరథ మంచి నీళ్ళు ట్యాంకు ద్వారా వస్తున్న నీళ్లను ప్రజలు, ఇంటికి, వంటికి, తాగడానికి అవసరాలకు వినియోగించుకునేవారు. దీంతో గ్రామస్తులు ఆనీటి ద్వారా కొంత దుర్గంధం రావడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. గ్రామంలో ఉన్న భగీరత ట్యాంకు పైకి ఎక్కి గమనించగా.. ఆ ట్యాంకులో కుళ్లిపోయిన కోతి కాళేబరం కనిపించింది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయపడ్డారు. గ్రామస్తులు, గ్రామ నీటి నిర్వాహకులకు సరిగ్గా వేతనాలు అందకపోవడంతోనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఇంతకాలం కలుషితమైన నీటిని తాగామా..అని గ్రామస్తులు వాపోయారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథతో శుద్ధమైన జలం వస్తుందనుకుంటే ఇటువంటి విషపూరితమైన నీరు అందడంతో గ్రామస్తులు నెవ్వరపోయారు. ఇకనైనా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకొవలన్నారు. అలాగే ఇన్ని రోజులుగా కుళ్లిపోయిన నీళ్లు తాగినందుకు ప్రభుత్వం ద్వారా మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో గ్రామస్తులందరూ ఏకమై ఆందోళన చేస్తామని హెచ్చరించారు.