ఒకే ఇంట్లో నలుగురు ఎంబీబీఎస్ లు
హైదరాబాద్ అక్టోబర్ 10(ప్రజాక్షేత్రం):ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.