Praja Kshetram
తెలంగాణ

హిందువులను సంఘటితం చేయాలి

హిందువులను సంఘటితం చేయాలి

-శంకర్ పల్లి కవాతు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు.

శంకర్ పల్లి అక్టోబరు 10(ప్రజాక్షేత్రం):హిందువులను సంఘటితం చేయాలని శంకర్ పల్లి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం శంకర్ పల్లి పట్టణంలోని డి యం ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన విజయదశమి మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హిందూధర్మాన్ని ముక్కలు చేసే కుట్ర మనలోనే జరుగుతోందని, తిప్పికొట్టేందుకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలని చిన్ననాటి నుంచే పిల్లలకు భారతీయ సాంప్రదాయం నేర్పించాలని సూచించారు. లవ్‌జిహాద్‌లతో, మతమార్పిడిలతో హిందు ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇతర మత ధర్మాలను ఆర్‌ఎస్‌ఎస్‌ కించపరచ దన్నారు. తిరుపతి లడ్డు అంశంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. హిందుధర్మంపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా లక్ష ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు పెంచాలని అన్నారు. గ్రామాలలో అంటరానితనం, అస్పృశ్యతకు తావుండవద్దని, దేవాలయాలలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దని కోరారు. ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఐదు సూత్రాలను వివరించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల కవాతు

విజయదశమి మహోత్సవం పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు శంకర్ పల్లి పట్టణంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై స్థానికులు పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.యస్ రత్నం, ప్రభాకర్ రెడ్డి, రాములు, సురేష్, వాసుదేవ్ కాన్నా, నందు తో పాటు పలువురు పాల్గొన్నారు.

Related posts