గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పెద్దేముల్ అక్టోబర్ 13(ప్రజాక్షేత్రం):గర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపాల్పూర్ గ్రామానికి చెందిన కురువ బాలప్ప (38), తన దగ్గర ఉన్న 5 ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట వేశారు. మొక్కజొన్న పంటను అడవి పందులు నాశనం చేయడంతో, పందుల బెడద నుండి పంటను రక్షించుకునే క్రమంలో, పంట పొలానికి కాపులగా బాలప్ప వెళ్లగా… మధ్యరాత్రి 12:30 గంటల ప్రాంతంలో బాలప్పను గుర్తుతెలియని వాహనము ఢీకొన్నట్లు, స్థానికులు.. కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. ఇట్టి విషయం బాలప్ప కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరి వెల్లడించారు.